Sunday, March 1, 2026

ఇందిరమ్మ రాజ్యమంటే ఇదే…

ఇందిరమ్మ రాజ్యమంటే ఇదే...

కార్యకర్త గుండెల్లో  సంతోషం నిండిన వేళ ..

ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం

ప్రతి పేదవారికి ఇల్లు ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో భాగంగా జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశానుసారం బచ్చన్నపేట మండలంలోని బచ్చన్నపేట పట్టణంలో లబ్ధిదారుడైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జంగిటి సిద్ధులు కు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి గ్రామ శాఖ అధ్యక్షుడు కోడూరి మహాత్మ చారి కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడుకోడూరి మహాత్మ చారి మాట్లాడుతూ గత టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో బచ్చన్నపేట గ్రామంలో ఒక్కరి కూడా ఇల్లు ఇచ్చిన చరిత్ర లేదని, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదల కష్టాలను చూసి ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని నేడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాతనే నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేసి వారి సొంత ఇంటికాలను నెరవేర్చడం జరిగిందని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రతి పేదవారికి నేరుగా అందే విధంగా కృషి చేస్తుందని రానున్న రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలకు నేరుగా అందిస్తుందని అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జిల్లా సందీప్, ఈదులకంటి వెంకట్ రెడ్డి, గుర్రపు బాలరాజు, యాదగిరి   దిడిగా రమేష్, దేవరకొండ రమేష్, అవధూత శ్రీనివాస్, వడ్డేపల్లి  వెంకట్ రెడ్డి, తమ్ముడి  మహేందర్ , అట్లా నర్సారెడ్డి , జంగిటి సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular