Sunday, March 1, 2026

బచ్చన్నపేట మండలంలో చెరువులు, కుంటలు నింపుతాం 

చెరువులు, కుంటలు నింపుతాం

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం

బచ్చన్నపేట మండలంలో గోదావరి జలాలతో చెరువులు ,కుంటలు నింపుతామని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్లనాగుల శ్వేత వెంకన్న అన్నారు. ఈ సందర్భంగా జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశానుసారం వారు మాట్లాడుతూ బొమ్మకూరు డ్యామ్ నుండి తపాస్పల్లి డ్యాంకు గత ఐదు రోజుల నుండి నీళ్లను విడుదల చేయడం జరిగిందని, ఇంకా సుమారు 15 రోజుల వరకు నీళ్లను విడుదల చేసి బచ్చన్నపేట మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో చెరువులను, కుంటలను నింపడమే లక్ష్యంగా జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇది రైతన్నల ప్రభుత్వమని రైతన్నల అభివృద్ధి కోసం 2 లక్షల వరకు రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలను అమలు చేసిందని, పేద ప్రజలకు సన్న బియ్యం, నూతన రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ బిల్లు, ఆరోగ్యశ్రీ, సబ్సిడీ గ్యాస్, ఇలా అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి పథకాలను చూసి ఓర్వలేక మాట్లాడుతున్న బిఆర్ఎస్ నాయకులకు రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. ఈ సందర్భంగా నాయకులు జంగిటి విద్యనాథ్, ఆముదాల మల్లారెడ్డి, నిమ్మ కరుణాకర్ రెడ్డి, పిన్నింటి నారాయణరెడ్డి, గార్లపాటి మైపాల్ రెడ్డి, బొట్టు గణపతి, కట్కూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular