నీళ్ల కోసం ఇక పోరాటమే…
చెరువులు ,కుంటలు నింపకపోతే ధర్నాలు చేస్తాం
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండలంలో ఉన్న అన్ని చెరువులు ,కుంటలు నాలుగు రోజులలో నింపకపోతే బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, బిఆర్ఎస్ మండల శ్రేణుల ఆధ్వర్యంలో రైతుల ప్రక్షాన ధర్నాలు చేస్తామని సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులపై కక్షతో నీళ్లను విడుదల చేయక ఇబ్బందులకు గురి చేస్తుందని, గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెరువులు ,కుంటలు నిండి వ్యవసాయం సస్యశ్యామలంగా ఉందని, ఈ ప్రభుత్వంలో వర్షాలు లేక చెరువులు నింపక నీటి ఎద్దడి ఏర్పడిందని అన్నారు. ఈ కరువుకు రైతులు మళ్లీ వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిందని, నాలుగు రోజులలో చెరువులు కుంటలు నింపకపోతే రోడ్డుపై ధర్నా లు చేస్తామని హెచ్చరించారు.