గోపాల్ నగర్ లో ప్రజల రేషన్‌కార్డుల కల నెరవేరింది
రేషన్ కార్డులు పంపిణీ కాంగ్రెస్ పార్టీ గోపాల్ నగర్ శాఖ అధ్యక్షుడు గణపురం నాగేష్
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాని రేషన్ కార్డులు, కాం గ్రెస్ ప్రభుత్వంలో అందజేసి పేదల కల నెరవేరుస్తున్నామని కాంగ్రెస్ పార్టీ గోపాల్ నగర్ శాఖ అధ్యక్షుడు గణపురం నాగేష్ అన్నారు.గోపాల్ నగర్ గ్రామంలో మంజూరైన రేషన్‌కార్డులను లబ్ధిదారుల కు జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశానుసారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలన్నింటికీ మూలమైన రేషన్‌కార్డులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయని నమ్మించి మోసం చేసిన గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్కరేషన్‌కార్డు ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 5.60లక్షల నూతన రేషన్‌కార్డులు ఇస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా పర్వతం యాదగిరి, పస్తం పోచయ్య, వల్లాల సత్యనారాయణ, వద్దిఎల్లయ్య, చింతల కర్ణాకర్, సిరిపాటి రామదాసు, నాగభూషణం,గంగరబోయిన మహేందర్, నీల జంపయ్య, నీల నవీన్, కళ్యాణం రామ్, సాయి తదితరులు పాల్గొన్నారు.