అమ్మని తిడుతున్నాడని ఒకరిని హత్య…
తల్లి మీద ప్రేమ ఒకరిని హత్య చేయించింది
నలుగురు జీవితాలను ఆగం చేసింది
అసలు ఏం జరిగిందంటే…
జనగామ ఏసిపి ప్రెస్ మీట్
మన సాక్షి గొంతుక డెస్క్
మతిస్థిమితం లేని వ్యక్తిని హత్య చేసిన కేసులో నలుగురిని బచ్చన్నపేట పోలీసులు అరెస్టు చేశారు. బచ్చన్నపేటలో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ఏసిపి నితిన్ చేతన్ మాట్లాడుతూ తెలిపిన వివరాల ప్రకారం
తేదీ:17-07-2025 రోజున అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బచ్చన్నపేట సెంటర్లో గత 5 సంవత్సరాలుగా తిరుగుతున్న మతిస్థిమితం లేని (Streat Bagger) వ్యక్తి రాజిరెడ్డి ని హత్య చేసినారని మాకు మరుసటి రోజు తెల్లవారు జామున ఉదయం 07:00 గంటలకు సమాచారం రాగా వెంటనే బచ్చన్నపేట పోలీసు వారు సంఘటన స్థలానికి చేరుకొని క్రైమ్ సీన్ ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా క్లోస్ టీం & డాగ్స్ స్క్వాడ్ లను పిలిపించి ఆధారాలు సేకరించినాము. అందుబాటులో ఉన్న టెక్నాలజీ & సిసి ఫుటేజీ ఆధారంగా ముద్దాయిలను A1-పురాణం ఉమా సాగర్ @ సన్నీ, S/o సతీష్, వయస్సు: 21 సంవత్సరాలు, కులం: పద్మశాలి, R/o బచ్చన్నపేట & A2-కోరుబోతుల అరుణ్, S/o యాదగిరి, వయస్సు:18సంవత్సరాలు, కులం:ముదిరాజ్, R/o బచ్చన్నపేట అనువారిని గుర్తించి, వారికి సహకరించిన మరో ఇద్దరిని A3-కోరుబోతుల రాజు, S/o యాదగిరి, వయస్సు:20 సంవత్సరాలు, కులం:ముదిరాజ్, R/o బచ్చన్నపేట & A4-తంగళ్ళపల్లి విజయ్, S/o అనంతచారి, వయస్సు: 22సంవత్సరాలు, కులం: కమ్మరి, R/o బచ్చన్నపేట అను వారిని పట్టుకోవడం జరిగింది. గత కొన్ని రోజుల నుండి బచ్చన్నపేటలో మతిస్థిమితం లేని రాజిరెడ్డి అనే వ్యక్తి అప్పుడప్పుడు ముద్దాయి ఉమా సాగర్ @ సన్నీ యొక్క పునుగుల బండి వద్ద బాగా గిరాకీ ఉన్న సమయంలో వెళ్ళి కస్టమర్స్ ముందే నిలబడి అతని అమ్మని చూస్తూ గలీజ్ గా అసభ్యకర బూతులు తిడుతుండేవాడని, అతని వల్ల గిరాకీ అంతరాయం కల్గుతుందని అతనిని ఎలాగైనా కొట్టి, హతమార్చలనే ఉద్దేషంతో A2-కోరుబోతుల అరుణ్ తో కలిసి తేదీ:17-07-2025 రోజున అర్ధరాత్రి రాజిరెడ్డిని హత్య చేసినారు. మరో ఇద్దరు A3-కోరుబోతుల రాజు & A4-తంగళ్ళపల్లి విజయ్ హత్య చేసిన వారికి సహకరించినారు. ముద్దాయిల ద్వారా హత్యకు ఉపయోగించిన సిమెంటు ఇటుక, నేర స్థలంనుండితప్పించుకోవడానికి కాల్చివేసిన షర్ట్ పిసులను & దాచిపెట్టిన ప్యాంటులను, ఒక స్కూటీ & ఒక బైక్ అన్నింటిని సీజ్ చేయడం జరిగింది. వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. హత్యలో పాల్గొన్న వారితోపాటు హత్యకు సహకరించిన మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. కండ్ల ముందు ఎలాంటి నేరం జరిగినా కూడా నేరస్థులను తప్పించుటకు ప్రయత్నిస్తే హత్యకు సహకరించిన వారు కూడా కటకటాల పాలు అవుతారు & వారికి శిక్ష పడుతుంది. కేసును త్వరితగతిన డిటెక్టివ్ చేసినందుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ M. అబ్బయ్య, సబ్ ఇన్స్పెక్టర్ S.K హమీద్ గారితో పాటుగా సిబ్బంది N. రాకేష్, T. రామన్న, K.అనిల్ కుమార్ యాదవ్, K. భాను చందర్, S. శ్రీనివాస్, D. తిరుపతిరెడ్డి, B. తిరుపతి లను ACP-జనగామ అభినందించారు.