చారిటబుల్ ట్రస్టు ద్వారా ఆర్థిక చేయుత
మన సాక్షి గొంతుక ప్రతినిధి:కన్నెపల్లి, ఆగస్టు 04.
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం లో నివాసముండే గొర్లపల్లి యోగేశ్వర్ ఎం.బి.బి.ఎస్ సిమ్స్ రామగుండం లో చదువుతున్నాడు.తన ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల గత సంవత్సరం ఫీజు కట్టడం కోసం 10వేల రూపాయలు ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేశారు.రెండో సంవత్సరం కూడ అతను ఫీజు కోసం మా ఆక్ట్ ని సంప్రదించడం జరిగిందని,దీనికి స్పందించిన ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు తిరుపతి (10,000) పదివేల రూపాయల ఆర్థిక సహాయం వారి తండ్రి కిష్టయ్య కి చెక్ రూపంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ఇంకా ఎవరైనా దాతలు స్పందించి అతని బంగారు భవిష్యత్తు కు బాటలు వేయడంలో సాయం చేస్తారని ఆశిస్తున్నాం అన్నారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సట్ల మహేందర్,
సభ్యులు బి. తిరుపతి,కె. సంపత్ ,బి. భూమేష్ పాల్గొన్నారు.