రామన్న అంటే బండ నాగారం గ్రామానికి ఓ ధైర్యం….
మృతురాలి కుటుంబానికి బియ్యం అందజేత
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేటమండలంలోని, బండనాగారం గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం మరణించిన మానేపల్లి భూదవ్వ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఇజ్జగిరి రాములు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వారి ఇంటికి వెళ్లి పరామర్శించి, యాభై కిలోల బియ్యన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఎప్పుడూ అండగా ఉంటానని, ప్రజా సేవ చేయడమే తన లక్ష్యమని తెలియజేశారు. రానున్న రోజుల్లో జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి ముందు ఉంటానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అరేళ్ళ భాస్కర్,జంగిలి స్వామి,ఆముదల సుధాకర్ రెడ్డి,ఎల్లా చంద్రారెడ్డి ఇజ్జగిరి కరుణాకర్,ఇజ్జగిరి నరేష్, సావదు లక్ష్మారెడ్డి,మానేపల్లి దేవయ్య, యాదయ్య, మల్లయ్య, లక్ష్మయ్య, భూమయ్య, బలరాం, రాములు,నర్సింహులు, ప్రభాకర్, కుంచం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.