అభిమానం చాటుకున్న గంధ మల్ల నరేందర్
ఎమ్మెల్యే ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి…
పట్టణ అధ్యక్షుడు గంధ మల్ల నరేందర్
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం ఆరోగ్య ప్రదాత, విద్యాదాత జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రమాదమశాత్తు గాయమై కోలుకున్న తర్వాత మొదటిసారి జనగామ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా బచ్చన్నపేట మండల కేంద్రంలో వారికి ఏ ఆపద రాకుండా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జనగామ నియోజకవర్గ ప్రజలకు అండదండగా ఉండి ప్రజలకు మరింత సేవ చేయాలని ఎమ్మెల్యే కి ఎలాంటి ఆపద రాకుండా ఉండాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి కి స్వాగతం తెలియజేస్తూ వారికి గుమ్మడికాయతో దిష్టి నీ పట్టణ అధ్యక్షుడు గంధ మల్ల నరేందర్ తీయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటినుండి ఎమ్మెల్యేకు ఎలాంటి ఆటంకం జరగకుండా వారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గుమ్మడికాయతో దిష్టి తీయడం జరిగిందని, రానున్న ఎన్నికల్లో బచ్చన్నపేట మండలంలో విజయ డంక మోగిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బొడిగం చంద్రారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి,నరేడ్ల బాల్ రెడ్డి, కల్లూరి అనిల్ రెడ్డి, వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి, కానుకంటి బాల చందర్, బోడిగం గోవర్ధన్ రెడ్డి, సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.