మండలంలో బిఆర్ఎస్ జండా ఎగరేస్తాం

ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల్లో గెలుపు మాదే….
బిఆర్ఎస్ పార్టీ మండల కోఆర్డినేటర్ ఎండి ఫిరోజ్
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండలంలో జరగనున్న ఎంపిటిసి ,జెడ్పిటిసి ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకొని బిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరేస్తామని బిఆర్ఎస్ పార్టీ మండల కోఆర్డినేటర్ ఎండి ఫిరోజ్ అన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామస్థాయిలో బిఆర్ఎస్ పార్టీ క్యాడర్ పటిష్టంగా ఉందని, నాయకులను ,కార్యకర్తలను కలుపుకొని, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాలకు పాటిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. ఎన్నికలు ఏదైనా గెలుపు మాత్రం బిఆర్ఎస్ పార్టీదే అని దిమా వ్యక్తం చేశారు.

