మాసాపేట రవీందర్ రెడ్డి తక్షణమే భేషరతుగా క్షమాపణ చెప్పాలి.

బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గందమల్ల నరేందర్
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
పబ్బం గడపడం కోసం పదవి వ్యామోహం పై పూటకో పార్టీ మారే మాసాపేట రవీందర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించే స్థాయి కాదని పద్ధతి మార్చుకోవాలని బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గంధమల్ల నరేందర్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసే గొప్ప వ్యక్తి నిబద్ధత కలిగిన మహా నాయకుడు జనగామ ప్రజల కోసం తన సొంత హాస్పిటల్ లో ఉచితంగా వైద్యం అందిస్తున్న నాయకున్ని పట్టుకొని మాసపేట రవీందర్ రెడ్డి అనే వ్యక్తి విమర్శించడం విడ్డురమ్మని అన్నారు.పదవి వ్యామోహంతో మాసాపేట రవీందర్ రెడ్డి పూటకు పార్టీ మారుస్తూ పబ్బం కడుతు మా ఎమ్మెల్యే పై విమర్శలు చేయడం మానుకోవాలి. తక్షణమే ఎమ్మెల్యే పల్లా కి క్షమాపణ చెప్పాలి. ముందుగా ప్రజలకు సేవ చేయడం నేర్చుకొని ఒకే పార్టీలో నిలకడగా ఉండడం నేర్చుకోవాలని హెచ్చరించారు.

