పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ చైర్మన్
శ్వేత వెంకన్న

మన సాక్షి గొంతుక చేర్యాల మండలo వీరన్నపేట గ్రామంలో మహేశ్వరీ పత్తి మిల్లు లో కొనుగోలు కేంద్రానీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్వేత వెంకన్న సీసీఐ అధికారి హమీత్ , వ్యవసాయ మార్కెట్ సెక్రెటరీ రవి కుమార్ ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ కాపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని నేరుగా సి సి ఐ కి పత్తి నీ విక్రయించి కనీస మద్దతు ధర 8110రూ”పొందగలరు.దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వంచే లైసెన్సు పొందిన వ్యాపారస్తులకు మాత్రమే పత్తిని అమ్మలని సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ జీవన్ రెడ్డి ,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు లక్ష్మీనారాయణ, రామ్ రెడ్డి, లింగమూర్తి, భాను ప్రకాశ్ మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు, మిల్లు యజమానులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.
పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ చైర్మన్

