బచ్చన్నపేట మండలంలో గెలుపు సంబరాలు…


ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్ పార్టీదే……
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఓట్లతో దూసుకుపోవడంతో బచ్చన్నపేట మండలం గోపాల్ నగర్ గ్రామంలో ప్రధాన చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఘనపురం నాగేష్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి, స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగిన కాంగ్రెస్ పార్టీ కి ఎదురులేదని, కాంగ్రెస్ పార్టీ అంటే పేదల సంక్షేమం కోరే ఏకైక పార్టీ అని అన్నారు. అందుకే జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ కు ఓట్లు వేసి పట్టాం కట్టారని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మురి ప్రతాప్ రెడ్డి, కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన విధంగా అన్ని పథకాలు అమలు చేసిందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ మాసాపేట రవీందర్ రెడ్డి, పడమటికేశవపూర్ మాజీ సర్పంచ్ గిద్దల రమేష్, వల్లాల సత్యనారాయణ, పర్వతం యాదగిరి, వద్ది ఎల్లయ్య, పస్తం పోచయ్య, చింతల కర్ణాకర్, గంగారబోయిన మహేందర్, నాగభూషణం, కళ్యాణ్ రామ్,నీల కృష్ణ, అఖిల్ మాల ,రాములు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

