కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ని విమర్శించే స్థాయి నీది కాదు….

రైతులపై నీది ముసలి కన్నీరు….
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
మన ప్రాంత అభివృద్ధి గురించి ఎల్లప్పుడూ పరితపించే రాష్ట్ర యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ని విమర్శించే స్థాయి అర్హత నీకెక్కడిది ఇమ్మడి జితేందర్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడుగా ఇప్పటి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నప్పుడు జనగామ, బచ్చన్నపేట ప్రాంతంలో వడగండ్ల వర్షాలకు పంటలు నష్టపోయినప్పుడు నువ్వెక్కడ ఉన్నావు, ఎకరానికి పదివేలు ఇస్తా అని మోసం చేసినప్పుడు రైతుల గురించి నువ్వు కార్చే ఈ ముసలి కన్నీరు ఎక్కడ పోయింది. మా నాయకుని సారధ్యంలో ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి.కానీ మీ హయంలో ప్రతి విలేజ్ లో బెల్ట్ షాపులు పెట్టి అందరినీ తాగుబోతులను చేసిన మీరా ఈరోజు తాగుబోతులను చేస్తున్నారు అని మాట్లాడేది. మాట్లాడే ముందు మీ స్థాయి, అర్హత మరియు మీరేం చేశారో చూసుకొని మాట్లాడితే మంచిది లేకుంటే కబర్దార్ జితేందర్ రెడ్డి అని సిద్దులగుట్ట మాజీ చైర్మన్ గాలి కృష్ణ, సిద్ధుల గుట్ట డైరెక్టర్ ఇమ్మడి తిరుపతి రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బాల్నే రాజేష్, కేసిరెడ్డిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు బాల్నే రమేష్ మరియు కేసిరెడ్డిపల్లి గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి ఇమ్మడి దర్శన్ రెడ్డి అన్నారు.

