స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ ఎస్ గల్లంతే..

ఇందిరమ్మ పాలనకు పట్టం కట్టిన ప్రజలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాలతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
ఇందిరమ్మ పాలనకు పట్టం కట్టి జూబ్లీహిల్స్ ఎన్నికలలో నవీన్ యాదవ్ గెలిపించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు అని సిద్దులగుట్ట చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి అన్నారు. బచ్చన్నపేట మండల కేంద్రంలో జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశానుసారం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు,నాయకులు అందరూ ప్రచారం చేసిన ప్రజలు ఇందిరమ్మ పాలన, రేవంతన్న మాట పై కట్టుబడి చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించి జూబ్లీహిల్స్ అభివృద్ధికి నాంది పలికారని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచి,ఎంపిటిసి, జెడ్పిటిసికాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించి పేద ప్రజల ప్రజా పాలన ప్రభుత్వమని నిరూపించుకుందని అన్నారు. రానున్న రోజుల్లో ఇంకా మరెన్నో పథకాలు ప్రజలకు అందుతాయని ,కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.

