నక్కవానిగూడెంలో మారిన రిజర్వేషన్

రాజకీయంలో చక్రం తిప్పినమాజీ వైస్ ఎంపీపీ
పలు పార్టీల నుండి టిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండలం నక్క వాని గూడెం గ్రామపంచాయతీకి రిజర్వేషన్ బిసి రావడంతో టిఆర్ఎస్ పార్టీలోకి గ్రామ యువకులు మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి, కేటీఆర్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా గులాబీ కండువా కప్పుకున్నారు. బిజెపి పార్టీ మాజీ మండల ఉపాధ్యక్షుడు పోతుల వెంకటేష్ యాదవ్ టిఆర్ఎస్ పార్టీలో చేరిన అనంతరం మాట్లాడుతూ ప్రజాసేవ చేయడానికి పార్టీ మారడం జరిగిందని ,రానున్న ఎన్నికలలో నక్క వాని గూడెం గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలిచి బీఆర్ఎస్ జెండా ఎగర వేస్తానని ధీమా వ్యక్తం చేశారు. పార్టీల చేరిన వారిలో కుంటిపల్లి శివ , చెరుకూరి క్రాంతి బొడిగె బాలరాజు గుంటుపల్లి దుర్గేష్ పోతుల సిద్ధులు పయ్యావుల సాయి పయ్యవుల రంజిత్, ఉన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు అరకుల నరసింహులు,కట్టెల స్వామి , ఏలూరి భాస్కర్ రెడ్డి, ఏలూరిరాజు రెడ్డి, జక్కుల, గుండని కృష్ణ, ఈదులకంటి కర్ణాకర్రెడ్డి, ఈదులకంటి విజయపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

