తెలంగాణ ఉద్యమకారుని నేను – ప్రజా సేవ చేయడానికి సిద్ధం

2005 తెలంగాణ ఉద్యమం నుండి కొనసాగుతున్న
లక్ష్మాపురం గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామానికి సేవ చేస్తా: నూకల కల్పన రాజిరెడ్డి
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట : మండలంలోని లక్ష్మాపురం గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ పరంగా జనరల్ మహిళా రావడంతో 2005 తెలంగాణ ఉద్యమం పాల్గొంటూ బిఆర్ఎస్ పార్టీలో చురుగ్గా పాల్గొంటున్న నూకల కల్పన రాజిరెడ్డి ఈసారి తమకు గ్రామ ప్రజలు అవకాశం ఇస్తే గ్రామానికి సేవ చేసుకుంటానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రజా ప్రభుత్వం విఫలమయిందని, రైతులకు రుణమాఫీ కాక రైతులు ఇబ్బందికి గురవుతున్నారని పేర్కొన్నారు. 2005 తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచే ప్రజల హక్కుల కోసం ముందుండి పోరాడుతూ, గ్రామ అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నానని బి ఆర్ ఎస్ అభ్యర్థి నూకల కల్పన రాజిరెడ్డి తెలిపారు. లక్ష్మాపురం గ్రామ ప్రజలు తనను ఆశీర్వదిస్తే గ్రామానికి మరింత సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు.తెలంగాణ ఉద్యమ రోజుల నుండి ప్రజల సమస్యలు, నీటి–భూమి–జీవన హక్కుల సాధన కోసం అహర్నిశలు కృషి చేసిన అనుభవం ఉన్నదని కల్పన రాజిరెడ్డి గుర్తుచేశారు. గ్రామంలో మౌలిక వసతుల విస్తరణ, తాగునీటి సమస్యల పరిష్కారం, రోడ్ల అభివృద్ధి, విద్య–ఆరోగ్య రంగాల మెరుగుదల, పేద కుటుంబాల సంక్షేమం, యువత ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాలను తన ప్రధాన ప్రాధాన్యాలుగా పేర్కొన్నారు.గ్రామ ప్రజల ఆశీర్వాదాలు లభిస్తే లక్ష్మాపురాన్ని బచ్చన్నపేట మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని నూకల కల్పన రాజిరెడ్డి హామీ ఇచ్చారు.

