
గ్రామాల్లో బిఆర్ఎస్ జెండా ఎగరేస్తాం…
ఐదు గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండలంలో పలు గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ నాయకుల సమావేశంలో కార్యకర్తలతో మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాబోయే సర్పంచ్ ఎన్నికలలో అభ్యర్థులుగా లింగంపల్లి మద్దికుంట రాధ, మన్సాన్పల్లి శాకంపల్లిరవీందర్ రెడ్డి, గంగపురం జిల్లెల్ల భాస్కర్ రెడ్డి,నాగిరెడ్డిపల్లి గ్రామంలోబంగారు రవి,పడమటి కేశపూర్ ఎర్రల్లో విజయ లను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థులుగా నిర్ణయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న సర్పంచ్ ఎన్నికలలో గ్రామ గ్రామాన బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ రైతు సమన్య సమితి అధ్యక్షులు రమణారెడ్డి, మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు బొడిగం చంద్రారెడ్డి,మండల మాజీ రైతు సమన్వయస సమితి అధ్యక్షుడు చల్ల శ్రీనివాస్ రెడ్డి, దూడల కనకయ్య,శశిధర్ రెడ్డి, సయ్యద్, జహంగీర్ , అజీమ్ ఆయా గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

