- సొంతగూటికి చేరిన కొయ్యడి శ్రీనివాస్ గౌడ్


మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
ఎన్నికలు సమీపించడంతో పోచన్నపేట రిజర్వేషన్ జనరల్ రావడంతో కాంగ్రెస్ పార్టీ ఘర్ వాపస్ లో భాగంగా సొంతగూటికి సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ నాయకుడు కొయ్యడి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పోచన్నపేట కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా కార్యకర్తల్లో ఉత్సాహం నిండింది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే కన్నతల్లి లాంటిదని, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా తన వంతు కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలతో నాయకులతో, కలిసిముందుకు వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు అక్కిరెడ్డి శ్రీధర్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు నల్ల మహేందర్, గ్రామ ఉపాధ్యక్షుడు నర్సింగ్ ఎల్లేష్ ,దాత్రపుల్లాజర్, రాముని మదన్మోహన్, డైరెక్టర్ శివ రాములు, దాత్రపు నరేష్, పోతుల రాములుయాదవ్, మేకల ఉపేందర్ రెడ్డి, నర్మట బాలరాజు,కోక్కలకొండ బాబు, సద్ది నర్సిరెడ్డి, యూత్ అధ్యక్షుడు శ్రీపతి అనిల్ ,నీల పాపయ్య, సంగమల బాలస్వామి ,ఆముదల అన్నపురెడ్డి, కంసాని శ్రీధర్ రెడ్డి, కొక్కలకొండ లింగం, రేణిగుంట గణేష్ ,జూల కృష్ణ, అవధూత ఉమేష్ ,తీగల చంద్రమౌళి, శ్రీపతి ప్రభాకర్ ,దాత్రపు దేవయ్య, కంసాని తిరుమలరెడ్డి, కాంట్రాజు బిక్షపతి, శ్రీపతి ప్రభాకర్, నల్ల మహేష్, తదితరులు పాల్గొన్నారు.

