Sunday, March 1, 2026

ప్రభుత్వ భూములను కాపాడి పేదలకు పంచాలి

ప్రభుత్వ భూములను కాపాడి పేదలకు పంచాలి

  • వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి. వెంకట్
  • వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య

మన సాక్షి గొంతుక/బచ్చన్నపేట మండలం

బచ్చన్నపేట మండలం చిన్నరాంచర్ల గ్రామ శివారులో ఉన్నా 174 సర్వే నెంబర్ లో 8-16 గంటల భూమిని బిఆర్ఎస్ నాయకుడు తెలంగాణ హైకోర్టును తప్పు తోవ పట్టించి అట్టి భూమిపై స్టేటస్కో ఆర్డర్ తీసుకొచ్చి అట్టి భూమిని కబ్జా చేసిన భూకబ్జాదారులపై కేసు నమోదు చేసి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంచాలని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి వెంకటుఅన్నారు. శుక్రవారం రోజున మండలంలోని 174 సర్వే నెంబర్ లో సిపిఎం ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకున్న గుడిసె వాసుల స్థలాన్ని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర బృందం పరిశీలించారు. బి వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికార పార్టీకి చెందిన నాయకులు కబ్జాలు చేసి ఆక్రమించుకుంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకపక్క కేసులు ఎత్తివేస్తామని చెప్తూనే గుడిసెలు వేసుకున్న పేదల పైన సిపిఎం నాయకులు పైన అక్రమ కేసులు పెట్టడం జైల్లోకి పంపడం, సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య మాట్లాడుతూ 174 సర్వే నంబర్ పై ఉన్న స్టేటస్కోను రద్దు చేస్తూ జిల్లా రెవెన్యూ కోర్టు ఇచ్చిన ఇచ్చిన ఆర్డర్ కాపీని మండల తాసిల్దార్ జిల్లా కోర్టుకు అందించడంలో కాలయాపన చేయడం భూ కబ్జార్లకు పరోక్షంగా సపోర్ట్ చేయడమే అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్లస్థలాల సమస్య ఉండదు అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరాలుగా నివాసముంటున్న గుడిసె వాసులకు ఇవ్వడంలో ఎందుకు ఎడకని వెనకడుగు వేస్తుందని ప్రశ్నించారు. పేదల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వానికి నయా పైసా కూడా ఖర్చు కాదన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేకుంటే పట్టాలకయ్యే పేపర్ ఖర్చులు సంతకం చేయడానికి సిరా ఖర్చులు మేము భరిస్తామని వారు అన్నారు. పేదల ప్రభుత్వాన్ని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు లేని వారికి ఇంటి స్థలాన్ని ఇచ్చి ఐదు లక్షల రూపాయల మంజూరు చేసి పేదల ప్రభుత్వం అని నిరూపించుకోవాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడి పేదలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట రాములు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు విజేందర్ ,మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్, నాయకులు గొల్లపల్లి బాపురెడ్డి, భూ పోరాట కమిటీ కన్వీనర్ పర్వతము నరసింహులు, సిపిఎం మండల కమిటీ సభ్యులు రామగల అశోక్ అన్నే బోయిన శ్రీను ,తాడెం రాములు, అన్నేబోయిన రాజు కడకంచి బాలరాజు, గంగరబోయిన బుచ్చమ్మ, బాశెట్టి శోభ పద్మ ,లక్ష్మి సుజాత ,హరి స్వర్ణ మల్లమ్మ హంసక్క తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular