రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సబ్ రిజిస్టర్ తస్లీమా
మన సాక్షి గొంతుక ప్రతినిధి న్యూస్ డెస్క్: మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు. రూ.19 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పట్టుబడ్డారు. వాటితో పాటు డాక్యుమెంట్ రైటర్ల నుంచి తీసుకున్న అమౌంట్ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, తస్లీమా ములుగు సబ్ రిజిస్ట్రార్గా గతంలో పనిచేశారు.
భూమి రిజిస్ట్రేషన్ విషయంలో సబ్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సాయంత్రం దాడులు నిర్వహించారు. ఒక వ్యక్తి నుంచి సబ్ రిజిస్ట్రర్ మహమ్మద్ తస్లీమా రూ. 19, 200 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

