గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం
మన సాక్షి గొంతుక /బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో పలు గ్రామాల మీదుగా వెళ్తూ ఓ జెట్ విమానం భూమికి అతి సమీపంలో చక్కర్లుకొ డుతుంది. గత వారం రోజులుగా రౌండ్లు తిరుగుతున్నది. గ్రామాల ప్రజలు, రైతులు విమానం ఎందుకు తిరుగుతుందో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. అసలు విమానం ఇంత కింది నుంచి ఎందుకు చక్కర్లు కొడుతోంది అని ఆలోచనలో ప్రజలు పడ్డారు. కొంతమంది జెట్ విమానాన్ని సరదాగా వీడియోలు, ఫొటోలు తీస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. భూబాగానికి అత్యంత సమీపం నుంచి ఎందుకు వెళుతున్నాయి ఎక్కడి వెళుతున్నాయి అంటూ గ్రామాల్లో చర్చనీయం గా మారింది. మండలంలో కొందరు మాత్రం ఏదైనా సర్వే చేస్తున్నారు కావచ్చు అని అనుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో చత్తీస్గడ్ లోని కాంకేడ్ ఎయిర్ పోర్ట్ అకాడమీలో పెట్టిన ట్రైనింగ్ నేపథ్యంలో జెట్ ఇక్కడ తిరుగుతున్నట్లు సమాచారం.