రఘుపతి నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలి
వెంటనే భూమిని పట్టా ఎక్కించాలి
లేనియెడల తహసీల్దార్ కార్యాలయంను ముట్టడి చేస్తాం
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

మన సాక్షి గొంతుక ప్రతినిధి/బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లాబచ్చన్న పేట
రఘుపతి మృతికి కారణమైన రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలి..తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలి..వెంటనే భూమిని పట్టా ఎక్కించాలి..లెనియెడల గ్రామం, మండల ప్రజలందరం కలిసి తహసీల్దార్ కార్యాలయం ముట్టడి చేస్తామని ఈ సందర్బంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని హేచ్చరించారు..ఆదివారం బచ్చన్న పేట మండలంలోని పడమటి కేశవపూర్ గ్రామానికి చెందిన కొమ్మాట రఘుపతి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు..ఈ సందర్బంగా కుటుంబ సభ్యులతో మాట్లాడారు,
కొమ్మాట రఘుపతి అనే రైతు దురుద్రుష్టవశాత్తు ఊరివేసుకొని చనిపోవడం చాలా బాధాకరం,వారి కుటుంబమే కాకుండా గ్రామస్తులంతా జరిగిన కారణాలను చాలా భాదతో చెప్పారు,భూమి రికార్డులు రఘుపతి పేరున ఎక్కకపోవడంతో చివరికి రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇచ్చి 18నెలలు దాటిన కూడా చివరికి ఆ భూమి ఎక్కడం వీలు కాదని వారు చెప్పడంతో మనస్తాపం చెందాడు,ఇవ్వాళ ప్రభుత్వం మారిన తరువాత మరిన్ని పైసలు ఎక్కువ ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేయడం, అధికారులకు ఒక విచ్చలవిడి తనంగా మారింది,ప్రజలను, రైతులను ఆదుకోవడానికి గత ప్రభుత్వం ఒక ధరణిని తీసుకవచ్చి దాదాపుగా 95శాతం మంది రైతులకు ఉపయోగపడెలా చేసింది,ఎక్కడ ఎక్కడా అయితే సమస్యలు ఉన్నాయో వాటిని తొలగించడం కోసం ఈ ప్రభుత్వాలు చూడాలి తప్పా.. ఒకరి మీద ఒకరు నెపం పెట్టి గత ప్రభుత్వాలు చేయలేదని చెప్పడం సరికాదు..
పేద రైతుకు న్యాయం చేయాలి,వారికి ఎక్కడ ఏమి సమస్యలున్నా పరిష్కారం చేయడానికి ఒక రెవెన్యూ సదస్సు పెడుతాం అన్నారు..అందులో భాగంగా రోజుకో స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు..ఇప్పటికి 100రోజులు అయిపొయింది,కానీ ప్రకటనలకే మిగిలిపోయింది
కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ లకు విధులను పంచి రైతుల పరిష్కారంకు కృషి చేస్తున్నామన్నారు..కానీ ఎందుకు ఈరోజు పేద రైతు భూమి తనకు ఎక్కలేదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..
రూ.6లక్షలు డబ్బులు వసూలు చేయడమే కాకుండా మరల డబ్బులు కావాలని రెవెన్యూ అధికారులు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెంది రఘుపతి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.రెవెన్యూ అధికారులు రఘుపతి దగ్గర తీసుకున్న డబ్బులు వెంటనే ఇవ్వాలి.. ఆయన పేరు మీద పట్టా ఎక్కించాలి,అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.లేనియెడల గ్రామం, మండల ప్రజలందరం కలిసి తహసీల్దార్ కార్యాలయం ముట్టడి చేస్తామని ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని హేచ్చరించారు, ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా రైతుబంధు అధ్యక్షులు రమణారెడ్డి చల్ల ఇండస్ట్రీస్ అధినేత చల్ల శ్రీనివాసరెడ్డి తదితరులు బి ఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

