రైతులు ఎవరు ఆందోళన చెందవద్దు
కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జ్ నూకల బాల్రెడ్డి
మన సాక్షి గొంతుక /బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పడమటి కేశపూర్ గ్రామంలో రైతు రఘుపతి మరణానికి గత ప్రభుత్వం బి ఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జ్ నూకల బాల్రెడ్డి అన్నారు. బచ్చన్నపేట మండలంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ , వారి ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడే సంవత్సరం నరగా రైతు మండల ఆఫీసు చుట్టూ తిరిగినప్పుడు భూమికి పట్టా చేయలేదని తానే ఒప్పుకున్నాడని, ఆ ప్రభుత్వ పాలన గురించి ఆ ఎమ్మెల్యేనే చెప్పడం ప్రజలు చూస్తున్నారని తెలియజేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ఘటనలు జరగకుండా, రైతుల సంక్షేమం కోసమే,ధరణి సమస్యలు ఎట్టకేలకు కొలిక్కి తెస్తుందన్నారు. వీటి పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. గతంలో మాదిరిగా కలెక్టర్ స్థాయిలో కాకుండా తహసీల్దార్లు, ఆర్డీఓలకు కూడా పరిష్కరించే బాధ్యతలు అప్పగించేలా ఆలోచన చేస్తోంది. విధి విధానాలు అమల్లోకి వస్తే మండల స్థాయిలోనే భూ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మండల స్థాయిలో పరిష్కారమయ్యే వాటిని తహసీల్దార్ వద్దనే చేసేలా, అక్కడ కానివి ఆర్డీఓకు పంపేలా.. అక్కడా పరిష్కారం కానివి కలెక్టర్‌కు పంపించేలా ఆలోచనలు చేస్తోంది. ఈ పద్ధతి అమల్లోకి వస్తే ధరణి భూ సమస్యలకు పరిష్కారం లభించనుంది. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కావు అని అన్నారు. రైతులెవరు ఆందోళన చెందవద్దని, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని ఇది ప్రజా పాలన ప్రజా ప్రభుత్వమని తెలియజేశారు.