ప్రభుత్వ ఆసుపత్రిలో నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి జనసేన పార్టీ సీనియర్ నాయకులు.. చందు నాయక్ ఆరోపణ
ప్రజా గొంతుక మార్చి 27 దేవరకొండ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు జిల్లా నల్లగొండ
దేవరకొండ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో నేలకు ఒక ప్రాణాలు గాల్లో గలుస్తున్నాయి అందులో దేవరకొండ నియోజకవర్గం గిరిజన లంబాడి ప్రాంతం గర్భిణీ స్త్రీలను సీరియస్ అయ్యేంతవరకు పట్టించుకోకపోవడం సీరియస్ అయిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోకపోతే నల్గొండ హైదరాబాద్ కు పంపియడం మార్గమధ్యలో నిండు ప్రాణాలు పోవడం జరుగుతుంది మొన్న ఆదివారం రోజున ఆరోగ్యంతో ఉన్న సాలి గర్భవతి పండంటి బిడ్డను జన్మనిచ్చి సంతోషంగా ఉండాల్సిన సమయంలో కడుపునొప్పి ఉందని ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే తనకు డాక్టర్లు పట్టించుకోకపోవడం నిర్లక్ష్యం వహించడం ఆ గర్భిణికి మహిళకి ఫిట్స్ రావడంతో హైదరాబాద్ పంపడం జరిగింది మార్గమధ్యలో మల్లేపల్లి దాటగానే ప్రాణము వదిలేసింది ప్రభుత్వ ఆసుపత్రిలో పురుగుల మందు తాగి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ప్రాణంతో బయట పడతామని నమ్మకం లేకుండా పోయింది అధికారులు పర్యటించే సమయంలో పూలతో డెకరేషన్తో ఆరాటాలతో హంగామా చేస్తారు తప్ప ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటివరకు ఎమర్జెన్సీతో సరిపడా సదుపాయాలు లేకపోవడంతో గిరిజన లంబాడి పేద బిడ్డలు ప్రైవేట్ హాస్పిటల్ లో చూపిచ్చుకోలేక గిరిజన ప్రజలు లబోదిబో అంటూ ప్రాణాలు కోల్పోతున్నారు తప్ప ప్రాణాలు కాపాడడం లేదు ప్రభుత్వ ఆసుపత్రిలో జ్వరం సర్ది చిన్న చిన్న వాటికే పరిమితం ఏదైనా టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటివి వస్తే మాత్రం ప్రైవేట్ తప్పడం లేదు ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారులు నామమాత్రంగానే పనిచేస్తున్నారు కనుక పై అధికారులు చొరవ తీసుకొని వస్తున్న నిధులు ఏంటి ఉండాల్సిన సదుపాయాలు ఉండే విధంగా వచ్చే రోగులకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే నయమయ్యే విధంగా అధికారులు పట్టించుకోవాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు చందు నాయక్ అన్నారు