Sunday, March 1, 2026

ప్లాంటేషన్ లలో నీళ్ళ టాంకర్లు ఏర్పాటు చేయాలి

అగ్ని ప్రమాదాలను అరికట్టడంలో టీఎస్ఎఫ్డీసి విఫలం

ప్లాంటేషన్ లలో నీళ్ళ టాంకర్లు ఏర్పాటు చేయాలి

ఆదివాసీ జీవన విధానం

ప్రజ గొంతుక మార్చి 29 అశ్వారావుపేట నియోజకవర్గం ప్రతినిధి గడ్డం వెంకటేష్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటవీ అభివృద్ధి సంస్థ ఆదీనంలో ఉన్న సుమారు 62 వేల ఎకరాల ప్లాంటేషన్లలో ప్రతి యాడాది వేసవిలో సంభవిస్తున్న అగ్ని ప్రమాదాల నివారణలో ఆ సంస్థ పూర్తిగా విఫలం అయిందని.ఆదివాసీ జీవన విధానం ఆరోపించింది.శుక్రవారం కొత్తగూడెం జిల్లా కేంద్రం లో ఆ సంస్థ డివిజన్ మేనేజర్ (డీఎం) చంద్ర మోహన్ కు వినతి పత్రం సమర్పించారు.సామాజిక కార్యకర్త,జర్నలిస్టు పి.క్రాంతి అనేక విషయాలను వారి దృష్టికి తీసుకు వెళ్ళారు.కర్రను సేకరించిన తరువాత వాటిని తగలబెట్టడం జరుగుతుంది.ఎవరైనా కావాలని వీటికి నిప్పంటిస్తున్నారా..? లేక ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కనుక మీ సంస్థనే వాటిని తగలబెట్టిస్తున్నదా అనే అనుమానం ప్రజల్లో ఉందని అన్నారు.టీ ఎస్ ఎఫ్ డీ సీ కి ఆదాయం వచ్చే పనులపై ఉన్న శ్రద్ద పర్యావరణం,జీవ వైవిద్యం పట్ల ఉండటం లేదని అవేదన వ్యక్తం చేశారు.48 సంవత్సరాలుగా అటవీ భూములు కారుచౌకగా లీజుకు తీసుకొని వ్యాపారం చేస్తున్న ఈ సంస్థ పంటతరువాత తగలబడుతున్న ప్లాంటేషన్ల నిర్వాహన కోసం ఇప్పటి వరకు ఏమి చర్యలు తీసుకున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.మంటల మూలంగా వచ్చే పొగ ఆ ప్రాంతంలో కాలుష్యానికి కారణం అవుతుందని,ఆ ప్లాంటేషన్లలో నేలపై గూడ్లు చేసుకొని గుడ్లు పెట్టే పక్షుల సంతతి అంతరించి పోతుందని,నేల కలుగుల్లో ఉన్న చీమలు,పాములు,ఎలుకలు,అడవిలో ఉంటే ఉడతల సంతతి పూర్తిగా ఆ మంటల్లో తగలబడి పోతున్నాయని అవేదన వ్యక్తం చేశారు.భూమిలో ఉండే సహజ సిద్దమైన పురుగులు,వానపాములు అగ్నికి ఆహుతై జీవవైవిద్యం దెబ్బతింటుందని గుర్తుచేశారు.మొక్కలు నాటేందుకు,చెట్లను నరికేందుకు,దుక్కులు దున్నేందుకు టెండర్లు పిలిచే మీకు అగ్నిప్రమాదాల నివారణ కోసం కూడా టెండర్లు పిలిచి పర్యావరణ హితానికి దోహదపడాలన్న హితం లేకపోవడం బాధాకరం అన్నారు.దీన్ని బట్టి కేవలం ఆదాయం పై ఉన్న శ్రద్ద సమాజ హితంపై లేదన్నది అక్షరాల నిజమన్నారు.ఇప్పటికైనా స్పందించి తక్షణమే అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular