భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం
మన సాక్షి గొంతుక మార్చి 29 దేవరకొండ ప్రతినిధి సి రం దాసు వెంకటేశ్వర్లు జిల్లా నల్గొండ
భారతీయ జనతా పార్టీ దేవరకొండ నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం స్థానిక పిపిఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి నల్లగొండ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విచ్చేసి మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ దేశ ప్రజల కోసం చేసిన మంచి పనులు సంక్షేమ పథకాలు ఈ ఎన్నికలలో బిజెపి విజయానికి నాంది అని దేశంలో ఈసారి 400 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవడం ఖాయమని అందులో మన నల్లగొండ పార్లమెంటు కూడా ఉండడం కోసం మనందరం కలసికట్టుగా నల్లగొండ పార్లమెంటుపై కాషాయం జెండా ఎగరవేయడం కోసం పనిచేద్దామని గతంలో నల్లగొండ పార్లమెంటు నుండి ప్రాతినిధ్యం వహించిన ఏ పార్లమెంటు సభ్యుడు కూడా నల్లగొండ వెనుకబాటు తనం గురించి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి కరువు కాటకాల గురించి పార్లమెంట్ స్థాయిలో పెద్దల దృష్టికి తీసుకుపోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఈసారి బిజెపి అభ్యర్థిని అయిన నన్ను గెలిపిస్తే తప్పకుండా నల్లగొండ పార్లమెంటు ప్రతిష్టతను ఢిల్లీలో వినిపిస్తానని మూడవసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని చేయడంలో నల్లగొండ పార్లమెంటు ప్రాతినిధ్యం కూడా అవసరమని 550 సంవత్సరాల అయోధ్య రామ మందిరం సాకారం చేసిన నరేంద్ర మోడీ ఓటు ద్వారా ఒక గొప్ప బహుమతిని ఇవ్వాలని నల్లగొండ పార్లమెంటు ప్రజలకు దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు విన్నవించుకుంటున్నాను నల్లగొండ పార్లమెంటు నుండి నన్ను గెలిపిస్తే నల్లగొండ పార్లమెంటు పరిధిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా తేవలసినటువంటి అన్ని ప్రాజెక్టులు తీసుకువచ్చి నల్లగొండలో 5అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్కు ఓటు వేస్తే మన ఓటు అక్కరకు రాకుండా పోతుందని దేశంలో మొత్తం కలిపినా కూడా 42 50 సీట్లు గెలిచే పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ లేదని టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా రాష్ట్రంలో ఉనికిని కోల్పోయిందని టిఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని కావున కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ బిజెపి పార్టీకి కమలం పువ్వు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించడంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని దేవరకొండ నియోజకవర్గ ప్రజలను కోరుతున్నాను. దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కాషాయం జెండా కోసం కమలం పువ్వు జండా కోసం నరేంద్ర మోడీ ఆశయ సాధన కోసం కలిసికట్టుగా పనిచేసే మన నల్లగొండ పార్లమెంటును కూడా రేపు జరిగే ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఒక బహుమతిగా ఇచ్చే విధంగా మన నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకునే విధంగా పాటుపడాలని వినంబపూర్వకంగా కోరుతున్నాను ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి దేవరకొండ నియోజకవర్గం కన్వీనర్ ఏ టి కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి చెనముని రాములు, ఉపాధ్యక్షులు వానం నరేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వస్కుల సుధాకర్, రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ నరసింహారావు మాజీ పార్లమెంట్ కన్వీనర్ నక్క వెంకటేష్ యాదవ్ పట్టణ అధ్యక్షులు గుండాల అంజయ్య, సాంబశివుడు మండల అధ్యక్షులు చివర్ల రమేష్ ,సాంబశివుడు జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శంకర్, తిరుపతి గౌడ్, వట్టెపు గోవర్ధన్, తదితర బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది