తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాం
తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు సరైన న్యాయం జరగడం లేదు,
మేము పోరాటాలు మొదలు పెడితే,ఏ రాజకీయ శక్తి అయిన తోక ముడుసుకొని పోవాల్సిందే,
సహనంతో ఉన్న మాదిగ పై రెచ్చగొట్టే వాక్యాలు మానుకోవాలి,, ఖబర్దార్ చెరుకు రామచందర్,
ప్రజా గొంతుక ప్రతినిధి, డిండి ;
సమాజంలో ఆర్థిక సామాజిక రాజకీయ అంశాలపై పీడిత ప్రజల అణిచివేత పై అలుపెరగని పోరాటం చేస్తున్న మాదిగ దండోరా ఉద్యమాన్ని, విమర్శించే నైతిక హక్కు మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామ చందర్ కి లేదని, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ ఎల్లేష్ మాదిగ అన్నారు,తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అవుతున్న గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో, నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాబినెట్ పదవులలో మాదిగలకు సరైన న్యాయం జరగడం లేదని అన్నారు, తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల జనాభాలో మాదిగలు అత్యధిక 80 లక్షల జనాభా కలిగి ఉన్నారని,మాలలు 80 లక్షల మంది జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నారో చెరుకు రామచందర్ ఆధారాలు చూపెట్టాలని ముదిగొండ ఎల్లేష్ డిమాండ్ చేశారు,నోటికొచ్చినట్టు వాగుడు వాగుతే తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు,బాంచన్ నీ కాలు మొక్కుతా అనే అలవాటు మాదిగలకు లేదు కాబట్టే రాజకీయంగా అణిచివేయాలని చూస్తున్నారని అన్నారు, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే సహించేది లేదని అన్నారు, బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలు మాదిగలను తీవ్రంగా అన్యాయం చేస్తున్నారు,తెలంగాణ రాష్ట్ర మాదిగ యువజన సంఘాల ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.