డిండిలో ఘనంగా 75 వ ఉర్సు షరీఫ్
గందోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముస్లిం సోదరులు
డిండి మండల కేంద్రంలో శ్రీ హజరత్ ఖాజయే ఖాజుగా ఖాజా మోహినొద్దీన్ అజ్మీర్ దర్గా,శ్రీ హజ్రత్ ఖాజా సయ్యద్ షా అమీరొద్దీన్ దర్గా 75వ ఉర్సు గందోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం బల్మూరి సైదులు ఇంటి నుండి భక్తి శ్రద్ధలతో పాటల నడుమ బయలు దేరి గంధం మహబూబ్ సుహాని దర్గా వద్దకు చేరుకుని దర్గాకు దట్టీలు పూలు మాలీదా సమర్పించి భక్తులు తమ మొక్కలను చెల్లించుకున్నారు.రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులతో పాటు భక్తులకు ఇఫ్తార్ విందు దర్గా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దర్గా పీఠాధిపతులు సయ్యద్ షా షర్పొదిన్, సైదులు, చాంద్ పాషా,, శ్రీధర్, చంద్రయ్య, బాబా, మల్లయ్య, టీ సైదులు,వెంకట్ రెడ్డి,నారయ్య, కర్ణాకర్ రెడ్డి, గంగాధర్,యాదగిరి, రమేష్, మన్నెమ్మ, అనసూయ, పార్వతమ్మ, చిన్నమ్మ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

