వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్
మన సాక్షి గొంతుక ప్రతినిధి /బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా ,బచ్చన్నపేట మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా రైతులు కలెక్టర్ తో గత ప్రభుత్వంలో తాలు పేరుమీద మిల్లర్లు మూడు నుండి నాలుగు కిలోల వరకు కట్ చేశారని,లారీలు సరైన సమయానికి రాకపోవడం వల్ల ఇబ్బందులకు గురైనమని,
బార్ధని సంచులు కూడా సరిపడ లేనందున గతంలో ఇబ్బందుల పాలైనామని కలెక్టర్ కి విన్నవించుకున్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ అలాంటి సంఘటనలు ఏమైనా మళ్లీ జరిగితే తమకి లిఖితపూర్వకంగా తెలియజేయాలని, వారిపై వెంటనే చర్యలు తీసుకోబడతాయని వారికి తెలియజేశారు. రైతులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు . రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలోనే విక్రయించి మద్దతు ధరను పొందాలని, ధాన్యాన్ని దళారులకు అమ్మవద్దని అన్నారు .ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్,డీసీఎస్ఓ రోజా రాణి, డీఏఓ వినోద్ కుమార్, డీసిఓ రాజేందర్ రెడ్డి, డీటీ సిఎస్ శ్రీనివాస్, దేవా, స్థానిక ఎమ్మార్వో విశాలాక్ష్మి, ఎంపీడీవో, రఘురామకృష్ణ కో-ఆపరేటివ్ సీఈవో బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు.