ప్రజా గొంతుక/ బచ్చన్నపేట మండలం
పిడిఎస్ బియ్యం తరలించడంలో కొత్త ఐడియాలతో పుష్పరాజులు తయారయ్యారు. ఎవరికి కనపడకుండా టాటా సుమోలో తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని బచ్చన్నపేట పోలీసులు పసిగట్టారు. వివరాల్లోకి వెళితే జనగామ జిల్లా బచ్చన్నపేట మండల పోలీస్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ నర్సిరెడ్డి తన సిబ్బందితో బచ్చన్నపేట మండలం లో పెట్రోలింగ్ చేస్తుండగా, అక్రమంగా టాటా సుమోలో పిడిఎస్ బియ్యం రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం రాగా, కొన్నే నుండి బచ్చన్నపేటకు వస్తుండగా తమకు ఎదురుగా ఒక టాటా సుమో వాహనం టీఎస్ 08 హెచ్ ఎన్ 4467 అనుమానాస్పదంగా వెళ్తుండగా అట్టి వాహనాన్ని తనిఖీ చేయగా అందులో పిడిఎస్ బియ్యం సుమారు 6 క్వింటాల్ బియ్యం ఉన్నాయి. వెంటనే అట్టి డ్రైవర్ ను విచారించగా అతని పేరు గుగులోతు శంకర్ తండ్రి లక్ష్మణ్ నాయక్ గ్రామం వట్టిపల్లి అని, వెంటనే పోలీస్ స్టేషన్ కు నిందుతుడిని మరియు వాహనాన్ని తీసుకువచ్చి కేసు నమోదు చేశారని ఎస్ ఐ కె. సతీష్ తెలిపినారు. హెడ్ కానిస్టేబుల్ పోలీస్ సిబ్బందిని సీఐ సాయి రమణ , ఎస్ఐ సతీష్ అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిడిఎస్ బియ్యాని అక్రమంగా ఎవరైనా తరలించినట్టుగా సమాచారం తెలిస్తే వెంటనే కాల్ చేసి సమాచారం తెలియజేయగలరని కోరారు. అట్టి వివరాలు తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని, అక్రమార్కులను పట్టుకోవడంలో పోలీసులు ముందు ఉంటారని తెలియజేశారు.

