సీఎం పదవిలో ఉన్నప్పుడు ఏనాడు రైతులని పట్టించుకోని కెసిఆర్
మన సాక్షి గొంతుక/ బచ్చన్నపేట మండలం
సీఎం పదవిలో ఉన్నప్పుడు ఏనాడు రైతులని పట్టించుకోని కెసిఆర్ ఈరోజు రైతులను ముందు పెట్టి రాజకీయం చేస్తున్నాడు అనికాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జ్ నూకల బాల్రెడ్డి అన్నారు.బచ్చన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జ్ నూకల బాల్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మీడియా తో మాట్లాడుతూ
జనగామ నియోజకవర్గం లో వడగండ్ల వర్షాలు పడి పంటలు నష్టపోతే నష్టపరిహారాన్ని ఇవ్వని కేసీఆర్ రైతుల పక్షపాతి అన్నట్టుగా నేను అండ ఉంటా అంటూ రావడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేసీఆర్ కుంభకర్ణ నిద్ర లేచిండు…ప్రజలను మోసం చేయడానికే నిన్న దేవరుప్పుల కి వచ్చాడు.పంటలు ఎండటానికి కారణం మీ పాపాలు కదా. ముందు చూపు లేకుండా కనీసం పరిజ్ఞానం లేకుండా ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడి రైతులకు తీవ్ర నష్టం కలిగించటం వల్ల ఈరోజు రైతుల పంటలకు మీరు కదా కారకులు.సీఎం పదవిలో ఉండగా మీరు ఏ రోజైనా ప్రత్యక్షంగా రైతులు రైతుల సమస్యలు మరియు రైతు కూలీల సమస్యలు పరీక్షించుట కొరకు ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పర్యటించార…..? గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలు మీ పాలనపై మరియు మీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకి ప్రజాస్వామ్య భద్రంగా తీర్పు ఇవ్వగా దాన్ని గౌరవించకుండా ప్రభుత్వాన్ని బజారుకీడుస్తానని పేర్కొనడం ఎంతవరకు సమంజసం.
గత ప్రభుత్వ హయాంలో మీకు సరిపాడు మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ప్రతిపక్ష నాయకులను బెదిరించి ప్రలోభాలకు గురి చేసి వారిని మీ పార్టీలో జాయిన్ చేసుకున్న వ్యక్తి ఈరోజు ఆ విధానాలను మాట్లాడడం సరియైన నీ విజ్ఞతకు వదిలేస్తున్నాము. కెసిఆర్ నీకు మతిభ్రమించి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మరియు మా నాయకుల మీద కోస్తున్నావు ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకోకుంటే ప్రజలు నీ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేస్తారు అధికారం పోయేసరికి బాధలో భవిష్యత్తులో కటకటాలే కాల్చి వస్తుందని భయంలో యాత్రలు అనే పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రజల ముందుకు వస్తున్నారు ఇది యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మీకు రాబోయే రోజుల్లో వారు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాము అన్నరు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి విద్యనాథ్ దిడిగా రమేష్, కనకయ్య గౌడ్ , నరేష్ ,అఖిల్ మాల తదితరులు పాల్గొన్నారు