జాబ్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలు ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనిని సద్వినియోగం చేసుకోవాలి

*ఎండాకాలంలో పని దొరకగా ఇబ్బంది పడే నిరుపేద కూలీలకు, కుటుంబాలకు ఉపాధి హామీ పథకం ఒక గొప్ప వరం లాంటిది*
*ప్రజా గొంతుక ఏప్రిల్ 2 దేవరకొండ ప్రతినిధి శరందాసు వెంకటేశ్వర్లు జిల్లా నల్గొండ*
*జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత*
*మాజీ సర్పంచ్*
*నేనావత్ శ్రీను నాయక్*
ఈరోజు మర్రిచేట్టుతండా గ్రామపంచాయతీ లో జాబ్ కార్డు పొందిన రైతులు కూలీలు అందరితో కలిసి రైతుల పొలంలో భూమి అభివృద్ధి పనులు, రాళ్లు వెరీ చదును చేసే పనిలో మాజీ సర్పంచ్ శ్రీను నాయక్ వారితో కలిసి ఉపాధి హామీ పని చేయడం జరిగింది..
వారు మాట్లాడుతూ ఎండాకాలంలో పని దొరకక చాలా ఇబ్బంది పడే నిరుపేద కుటుంబాలకు మరియు గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీ పథకం ఒక గొప్ప వరం లాంటిది,మరియు రైతులకు కూడా వారి పొలంలో భూమి చదును చేసి మరియు రాళ్లు ఏరువేత చేయడం వల్ల వారికి పంటలు వేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని వారు సూచించారు, మరియు ఎండాకాలం దృశ్య ఉపాధి హామీ కూలీకి వచ్చే వారికి నీటి సదుపాయం మరియు ఎండ తీవ్రతను నుండి కాపాడేందుకు టెంట్లను ఏర్పాటు చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి సూచించడం జరిగింది.. మరియు జాబ్ కార్డు పొందని వారు తమ ఆధార్,బ్యాంకు ఖాతా ను సంబంధిత అధికారులను అందచేయాలని వారు సూచించడం జరిగింది.
ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కీర్తి, ఫీల్డ్ అసిస్టెంట్ సక్య, మెట్ జబ్బర్, గ్రామస్తులు బిచ్య నాయక్, సుఖ్య, నార్య, లక్ష్మ, లఖ్య, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు..

