తెలంగాణ ఉద్యమకారులను
సమరయోధులుగా గుర్తించండి
గుర్తింపు కార్డులు ఇవ్వాలి
ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి.జిల్లా అధ్యక్షులు సంగీశెట్టి క్రిస్టఫర్
మన సాక్షి గొంతుక /యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగాలు చేసి జైలు జీవితం గడిపిన ఉద్యమకారులను గుర్తించి సమరయోధులుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ అన్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేసిన అమరుల కుటుంబాలను త్యాగాలు చేసిన ఉద్యమకారులను గుర్తించి ఝార్ఖండ్ రాష్ట్రంలో ఇస్తున్నట్లుగానే పెన్షన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చిన హామీని. వెంటనే నెరవేర్చాలని ఆయన అన్నారు ఈ సమావేశంలో జోగు అంజయ్య మారగోని శ్రీనివాస్ గౌడ్ కదిరేని స్వామి.మంటి లింగయ్య రమేష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు