ఇదెక్కడి న్యాయం అంటున్న గొలుసుల కనకమ్మ వారసులు
▪️అడిగిన డబ్బులు ఇవ్వలేదని వేదిస్తున్నారు
▪️తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు…

మన సాక్షి గొంతుక/ ఏప్రిల్ 3 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
(కొత్తగూడెం , చుంచుపల్లి ) మండలంలో కొందరు పలు రకాలుగా చెలామణి అవుతు డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారని వారు అడిగినంత సమర్పించకపోతే తప్పుడు ప్రచారం చేస్తూ ఎదుటివారిని అభాసుపాలు చేస్తున్నారని వీరి బారి నుండి కాపాడాలని గొలుసుల కనకమ్మ వారసులు కోరుతున్నారు. తమ స్థలంలో ప్రభుత్వ చెరువు ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అది తమ వ్యవసాయ అవసరాల కోసం తాము ఏర్పాటు చేసుకున్న కుంట అని దానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఎటువంటి ఖర్చు చేయలేదనే విషయాన్నీ అటు ఇరిగేషన్, ఇటు రెవిన్యూ అండ్ పంచాయతీ రాజ్ అధికారులు స్పష్టం చేశారని వాటికి సంబందించిన పత్రాలను, తమకు వారసత్వంగా వచ్చిన భూమి తాలూకు పాసు పుస్తకాలను మీడియా ముందు చూపించి తమపై విష ప్రచారం జరుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ సందర్బంగా గొలుసుల కనకమ్మ వారసులు మాట్లాడుతు రామాంజనేయ కాలనీ గ్రామపంచాయతీ పరిధిలోని సర్వేనెంబర్ 137/3ఆ/2 మా సొంత పొలంలోని నీటి అవసరాల నిమిత్తం ఒక చిన్న కుంటను ఏర్పాటు చేసుకుని అట్టి కుంటలోని నీటి ద్వారా గత 70 సంవత్సరాలనుండి వ్యవసాయం చేసుకొని జీవన కొనసాగించామన్నారు. వయసు రిత్యా మేము వ్యవసాయం చేయలేని పరిస్థితిలో అట్టి భూమిని చదును చేసుకుని మా వారసులు అందరూ పంచుకోవడం జరిగింది. ఈ క్రమంలో మేము పంచుకున్న భూముల్లో చిన్న చిన్న గదులు ఏర్పాటు చేసుకున్నాం అయితే వాటిపై కన్నేసిన కొంతమంది దళారులు తమకున్న రాజకీయ పరిచయాలతో తప్పుడు ప్రచారం చేస్తూ కొంతమంది దళారులను అడ్డుపెట్టుకుని అభాండాలు వేస్తున్నారన్నారు. ఇదేం న్యాయం అంటూ వారిని ప్రశ్నిస్తే తమపై దుర్భాషలాడుతు, తాము అడిగినంత డబ్బులు ఇస్తే ఇళ్ల స్థలాల గురించి పట్టించుకోబోమని, లేకుంటే తమ అంతుచూస్తామంటూ బహటంగా బెదిరిస్తున్నారంటు గొలుసులమ్మ కనకమ్మ వారసులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా కొంతమంది దళారులు తమను బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షలు కావాలని డిమాండ్ చేస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకుని వారి బారి నుండి తమను కాపాడాలని గొలుసుల కనకమ్మ వారసులు గొలుసుల మల్లయ్య, గొలుసుల సరోజినీ, గొలుసుల నాగరాజు, గొలుసుల లక్ష్మి, ఇండ్ల లక్ష్మయ్య, బూతికూరి లలిత, శాఖమూరి ఆదిలక్ష్మి, గణప నరసింహరావు కోరారు.

