Thursday, November 21, 2024

తీవ్రమైనఉష్ణోగ్రతలవలనజిల్లాప్రజలుఅప్రమత్తంగా ఉండాలి..

తీవ్రమైనఉష్ణోగ్రతలవలనజిల్లాప్రజలుఅప్రమత్తంగా ఉండాలి…

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శశికళ.

మన సాక్షి గొంతుక / గద్వాల్ జిల్లా.

జోగులాంబగద్వాలజిల్లా వైద్యఆరోగ్యశాఖఅధికారిడాక్టర్,శశికళబుధవారంప్రాథమికఆరోగ్యకేంద్రం మెడికల్ ఆఫీసర్లకు మరియుజిల్లావైద్యఆరోగ్య సిబ్బందికిగ్రామాలలో ఉన్నప్రజలకుపట్టణప్రజలకురోజురోజుకుపెరుగుతున్నఉష్ణోగ్రతలప్రభావం వల్ల వడదెబ్బకు గురికాకుండాగ్రామాలలో ఆశాకార్యకర్తలసహాయంతో ఇంటింటికి వెళ్లి ఆరోగ్య,క్షేమసమాచారములుతెలుసుకొనిఆరోగ్యసలహాలుఇస్తూ,ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా పంపిణీచేయవలసిందిగా ఆదేశించారు.

జిల్లాప్రజలుఅప్రమత్తంగాఉండాలని,తీవ్రఉష్ణోగ్రతలునమోదవుతున్నాయని,వడదెబ్బకు గురి కాకుండా అవసరమైన వారు మాత్రమే ఉదయం వచ్చి పనులు చేసుకుని వెళ్లాలని,మధ్యాహ్నవేళలోబయటికిరాకూడదని, తరచూ నీటిని మరియు ఇళ్లలో పలుచని మజ్జిగ నిమ్మరసం‌ తయారు చేసుకొని తీసుకోవాలని డాక్టర్ శశికళ తెలిపారు.

అనంతరం డాక్టర్, శశికళమాట్లాడుతూఎండవేడిమినుండిప్రజలుతీసుకోవలసినజాగ్రత్తల గురించి కొన్ని సూచనలు సలహాలుతెలియజేశారు
ఎండలో బయటకు వచ్చినచో తలకు టోపీ లేదా టవల్ చుట్టుకొని, కళ్ళకుసన్,గ్లాసెస్,పెట్టుకోవాలని,సాధ్యమైనంత వరకుతెలుపురంగుకాటన్ వస్త్రాలు ధరించాలని మరియుదాహంవేయకపోయినా తరచూ నీళ్ళు త్రాగాలని, ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీళ్లు నిమ్మరసం కొబ్బరి నీళ్లుతాగడంమంచిదని,వడదెబ్బ తగిలిన వారికి తల తిరగడంవాంతులు చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, వణుకు పుట్టడం, మగత నిద్రలేఖ కలవరింతలు ఉండడం , ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి కలిగి ఉండడం, వంటిలక్షణాలుఉన్నవారు దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలోవైద్యాధికారులను సంప్రదించాలని జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శశికళ తెలియజేశారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular