పేరుకే క్రీడా ప్రాంగణం.. నిర్వహణ అద్వానం
మన సాక్షి గొంతుక /గండీడ్ ఏప్రిల్ 3
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలోని జంగం రెడ్డి పల్లి గ్రామంలో పిచ్చి మొక్కలకు నిలయమైన క్రీడా ప్రాంగణం పట్టించుకోని అధికారులు,గ్రామాలలో యువత,విద్యార్థులకు క్రీడలలో నైపుణ్యం పెంపొందించుకోవడానికి మరియు ఆరోగ్యమైన జీవితం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది.జంగం రెడ్డి పల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణంలో పిచ్చి మొక్కలకు నిలయంగా మారడంతో ఆటలు ఆడేందుకు ఉపయోగం లేకుండా పోయింది.క్రీడా ప్రాంగణంలో వాలీబాల్,ఖోఖో,కబడ్డీ కోర్టులు ఏర్పాటు చేసి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఉపయోగపడే విధంగా చేయాలి గాని వాలీబాల్ కోర్టు స్తంభాలు మాత్రమే పాతి,సింగిల్,డబుల్ బార్లు ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు.కానీ ఎన్నడూ నిర్వహణ బాధ్యతలు చేపట్టలేదు,క్రీడా ప్రాంగణం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.