అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలి
డాక్టర్ ఝాన్సీ రెడ్డి
మన సాక్షి గొంతుక ప్రతినిధి/బచ్చన్నపేట మండలం
రోజు రోజుకు ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ సరైన జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ ఝాన్సీ రెడ్డి తెలిపారు. బచ్చన్నపేట మండలంలోని కొడవటూర్ పిహెచ్సిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… బయటకు వెళ్లేవారు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో బయటకు వెళ్లకపోవడం మంచిదన్నారు. ఎండ తీవ్రత పెరిగి తీవ్రమైన వేడి గాలులు వీచడం వలన దెబ్బ తగిలే ప్రమాదం ఉందని కావున బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువగా నీరు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలన్నారు.
ఓఆర్ఎస్ ప్యాకెట్ల అందజేత..
కొడవటూర్ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో రోగులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. అనంతరం సూచనలు సలహాలు ఇచ్చారు.
వడదెబ్బ తగిలినట్లయితే తీవ్రమైన తలనొప్పి, శరీర ఉష్ణోగ్రత పెరగడం, నాలుక ఎండిపోవడం, అపస్మారక స్థితికి వెళ్లడం జరుగుతుందని అలాంటప్పుడు వెంటనే చల్లటి ప్రదేశానికి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేసి వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు సునంద, సుగుణ ఆశాలు గంగం అనిత, అనూష, బందెల రమ, తుడుము సులోచన, విజయలక్ష్మి, వివోఏలు గంగం వాణి, మల్లం శోభ, అంగన్వాడి టీచర్ ప్రేమ లక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.