విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
ప్రజా గొంతుక నెక్కొండ ప్రతినిధి
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పనికర ప్రభుత్వ పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం.
మండలంలోని పనికర యూపీఎస్ పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం నిర్వహించారు బుధవారం పాఠశాల హెచ్ఎం బి సత్యనారాయణ ఆధ్వర్యంలో స్వయం పాలన దినోత్సవం నిర్వహించారు పాఠశాలలో విద్యార్థులు ఆర్ రాము, బి మేఘన, బి స్వాతి, అయేషా సిద్దిక, పావని ,బి ఋషి, సిహెచ్ హ్యాపీ ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా పనికర పెద్దలు పింగిలి మోహన్ రెడ్డి, మాజీ ఎస్ఎంసి చైర్మన్ బండారు యాకయ్య, హాజరై విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు ,పింగిలి మోహన్ రెడ్డి, బండారు యాకయాలను, శాలువాతో సత్కరించారు ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పి. అనిత, డి సుకన్య, పి శ్రీధర్, కే వెంకటేశ్వర్లు, పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.