బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా అమ్రాజ్ భాగ్యలక్ష్మి
మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా అమ్రాజ్ భాగ్యలక్ష్మి నీ , నియమిస్తున్నట్లు జనగామ జిల్లా మహిళా అధ్యక్షురాలు బడికే ఇందిరా, జిల్లా డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై నమ్మకంతో మహిళా అధ్యక్షురాలు బడికే ఇందిరా, జిల్లా డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి, బచ్చన్నపేట మండల ఇన్చార్జ్ నూకల బాల్రెడ్డికి, ప్రధాన కార్యదర్శి అల్వాల ఎల్లయ్య కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 20 సంవత్సరాలుగా పార్టీ కోసం, కష్టపడినందుకు గుర్తించి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ గ్రామాన పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా ఈదులకంటి వెంకటరెడ్డి, గాలి కృష్ణ, బందారం క్రాంతి తదితరులు పాల్గొన్నారు.