బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూకల బాల్రెడ్డి
మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఇన్చార్జిగా గత నెల రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన నూకల బాల్రెడ్డికి మండల అధ్యక్షుడిగా నియమిస్తూ ఎమ్మెల్సీ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆర్డర్ పత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డికి ,సీఎం రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ లకుప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థికి భారీ మెజార్టీ గెలుపు లక్ష్యంగా ముందుకు వెళ్తామని తెలియజేశారు.