ప్రజా గొంతుక న్యూస్/ బచ్చన్నపేట
పోషణపక్షం మహోత్సవాల్లో భాగంగా కొన్నే అంగన్వాడికేంద్రం లో పోషణపక్షంకార్యక్రమం నిర్వహించారు ఇందులో బచ్చన్నపేట ఎంపీడీవో రఘురామకృష్ణ కొన్నే పంచాయతీ కార్యదర్శి రాచకొండ ఉపేందర్ లింగంపల్లి సెక్టార్ సూపరవైజర్, కవిత,మరియు . అంగన్వాడీ టీచర్లు మినలాపురం ఉషారాణి భోగ విజయ అంబాల పద్మ. ఏఎన్ఎం లు ఆశ వర్కర్లు ఆయాలు తల్లులు, గర్భిణీలు బాలింతలు మరియు పిల్లలు పాల్గొని సంపూర్ణమైన ఆరోగ్యానికి తల్లిలు పిల్లలు ఎలా విధివిధానాలు పాటించాలని తెలియజేశారు,
ఈ కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు,చిరుధాన్యాలు ప్రమఖ్యత. ఆ వాటిని భోజనంగా వాడటం. అందులో ప్రోటీన్స్ విలువల గూర్చి తెలుసుకోవడానికి అగనివాడీ కేంద్రం ద్వారా అందించే సేవలు, పిల్లల పెరుగుదల అవసరమయ్యే ఆహరా పోషకాలు వివరించారు.
అందరూ అంగనవాడీ ద్వారా అందించే ఆరోగ్యలక్ష్మి. సేవలను వినియోగించుకోవాలని తల్లి సరియైన ఆరోగ్య సూత్రాలు పాటించనట్లయితే పుట్టే బిడ్డ కూడ సంపూర్ణ ఆరోగ్యవంతులాగా పుడతారు. కావున తల్లులు సరియైన పోషకాలు గల ఆహార పదార్థాలను స్వీకరించాలి. తగిన స్యాయమం చేయాలి అని తెలిపారు.

