చలో తుక్కుగూడ” కదిలి వెళ్దాం విజయవంతం చేద్దాం
“జన జాతర “సభను విజయవంతం చేయాలి
మన సాక్షి గొంతుక ప్రతినిధి /బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు , జంగిటి విద్యనాథ్ లు పత్రిక ప్రకటన చేస్తూ ఈ విదంగా మాట్లాడారు.రేపు జరిగే తుక్కుగూడ జన జాతర కు జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశాల మేరకు జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, బూతు స్థాయి నుండి కార్యకర్తలు ప్రజలను పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున కార్గే,సోనియా గాంధీ రాహుల్ గాంధీ,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిష్టాత్మకత కంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. తుక్కుగూడలో ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి 6 గ్యారంటీల మేనిఫెస్టో ఈ ప్రాంగణం నుండి విడుదల చేయడం జరిగిందని గుర్తు చేశారు.అదేవిధంగా రేపు జరగబోయే జన జాతర సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.