తుక్కుగూడకు బయలుదేరిన కాంగ్రెస్ సైన్యం
మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తుక్కుగుడా లో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం అధ్వర్యంలో నిర్వహిస్తున్న జన జాతర బహిరంగ సభకు జనగామ డిసిసి అధ్యక్షులు , కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశాల మేరకు బచ్చన్నపేట మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి ఆధ్వర్యంలో బచ్చన్నపేట మండలంలోని పలు గ్రామ శాఖ అధ్యక్షులు ఆధ్వర్యంలో గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు బచ్చన్నపేటకు చేరుకున్నారు. అనంతరం తుక్కుగూడకు భారీ వాహనాలలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి, కిసాన్ స్టేట్ కోఆర్డినేటర్ నిడిగొండ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే తుక్కుగూడ లో సభ నిర్వహించిన తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ సభ ద్వారా కేంద్రంలో కూడా అధికారంలోకి రాబోతుంది అన్ని అన్నారు. ఇక్కడి నుండే 6 గ్యారంటీలో ప్రకటించాము మళ్లీ ఇప్పుడు ఇకనుంచి మరిన్ని గ్యారెంటెడ్ పథకాల మేనిఫెస్టో ప్రకటించబోతున్నారని, ప్రతి పేదవారికి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామ శాఖ అధ్యక్షులు, మహిళ నాయకురాలు పలు గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.