వివిధ పార్టీల నాయకులు నర్రగిరి ఆధ్వర్యంలో సిపిఐ లో చేరిక
*పేదలకు పక్షాన పోరాడే ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ*
*నిరంతరం పేదలకు పక్షాన పోరాడే కమ్యూనిస్టు పార్టీలను ప్రజలు ఆదరించాలని పిలుపు*
*సిపిఐ మండల కార్యదర్శి నర్రగిరి*
*మన సాక్షి గొంతుక/తెలంగాణ బ్యూరో*
శంషాబాద్ :వివిధ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలకు చెందిన హుడా కాలానికి సంబంధించిన ప్రజలు సిపిఐ మండల కార్యదర్శి నర్రగిరి ఆధ్వర్యంలో ఆదివారం సిపిఐలో చేరారు
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సమితి సభ్యుడు ఆర్ యాదగిరి సిపిఐ మండల కార్యదర్శి నర్రగిరి మాట్లాడుతూ నిరంతరం పేదలకు పక్షాన పోరాడే కమ్యూనిస్టు పార్టీలను ప్రజలు ఆదరించాలని ఆయన పిలుపునిచ్చారు
ఈ మండలంలో ఏ కార్మికుడికి అన్యాయం జరిగినా ఏ కష్టజీవికి అన్యాయం జరిగినా ముందుగా స్పందించే పార్టీ సిపిఐ పార్టీ అని ఆయన అన్నారు
కార్మికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర సిపిఐ పార్టీకి ఉన్నదని రైతుల పోరాటాలకు కూలీల పోరాటాలకు ప్రత్యక్షంగా నాయకత్వం వహించి అనేక సమస్యలు పరిష్కరించిన ఘనత కమ్యూనిస్టు పార్టీ ఉన్నదని ఆయన కొనియాడారు
సిపిఐ సిపిఐ అనుబంధ సంఘాలలో వివిధ గ్రామాల ప్రజలు చేరడానికి సిద్ధంగా ఉన్నారని వారందరిని ఏఐటియుసి మరియు సిపిఐ లో చేర్చుకొని భవిష్యత్తు ఉద్యమాలకు పునాదులు వేస్తామని వారు తెలిపారు
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యుడు ఆర్ యాదగిరి ఏఐటియుసి మండల అధ్యక్షుడు అన్యపు ప్రభు అనిత రాజు పెద్ద యేసు రాయన్న నరసింహులు బాలరాజు శ్రీనివాసులు మోహన్ బాలయ్య హుస్సేన్ జాన్ విజ్జి తదితరులు పాల్గొన్నారు