ప్రజా గొంతుక :రంగా రెడ్డి జిల్లా బ్యూరో
రంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను గెలుపుకు కృషి చేయాలని, మే 13 న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ బలోపేతానికి విస్తృత సమావేశాలు చేపట్టాల ని దిశ నిర్ధేశం విధివిధానాలు పలు సూచనలు చేశారు. పార్టీ గెలుపుకు కార్యకర్తలు శక్తి వాంఛన లేకుండా కృషి చేయాలని పలు సూచనలు సలహాలు చేశారు. ప్రతి కార్యకర్తను కలిసే ప్రయత్నం చేయాలని , ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ అండగా నిలవాలన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక రాజేంద్రనగర్ శాసనసభ్యులు టి. ప్రకాష్ గౌడ్ , జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ,సబితా ఇందిరా రెడ్డి , కాలే యాదయ్య , అరెకపూడి గాంధీ , ఎమ్మెల్సీలు, మున్సిపల్ చైర్ పర్సన్ కోలన్ సుష్మా,మహేందర్ రెడ్డి,వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్,షాబాద్ మున్సిపాలిటీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దూడల వెంకటేష్ గౌడ్, గౌరవ కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు,శంషాబాద్ మునిపాలిటీ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు దూడల వెంకటేష్ గౌడ్ ,జడ్పిటిసి నీరటి తన్విరాజు ముదిరాజ్ , ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్ , వైస్ ఎంపీపీ నీల మోహన్ నాయక్ , మండల పార్టీ అధ్యక్షులు చంద్రారెడ్డి , సీనియర్ నాయకులు గణేష్ గుప్తా , పిఎసిఎస్ చైర్మన్ బుర్కుంట సతీష్ , సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.