లేగ దూడకు రెండు తలలు, ఆరు కాళ్లు
మన సాక్షి గొంతుక ప్రతినిధి // చర్ల //
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని జి.పి.పల్లి గ్రామంలో బోరా. శ్రీనివాసరెడ్డికి చెందిన పాడి ఆవు ఆదివారం తెల్లవారుజామున ఈనింది. పుట్టిన లేగ దూడకి రెండు తలలు, ఆరు కాళ్లు ఉండడంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు అందరూ శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వచ్చి లేగ దూడను అందరూ వింతగా చూశారు. పాడి ఆవు యజమాని లేగ దూడ పుట్టిన గంటకి మృతి చెందిందని తెలిపారు. ఇలా జరగడానికి కారణం ఏమిటి అని వెటర్నరీ డాక్టర్ని సంప్రదించగా జన్యు ఫర్ లోపం వలన అలా జన్మించిందని తెలిపారు.