భువనగిరి పార్లమెంటు నియోజక వర్గ స్థాయి సమావేశం విజయవంతం చేద్దాం

బిఆర్ఎస్ బచ్చన్నపేట మండల కోఆర్డినేటర్ ఎండి ఫిరోజ్
మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం
జనగామలో జరిగే భువనగిరి పార్లమెంటు నియోజక వర్గ స్థాయిసమావేశంవిజయవంతం చేద్దాం అని బిఆర్ఎస్ బచ్చన్నపేట మండలం కోఆర్డినేటర్ ఎండి ఫిరోజ్అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ శాసన సభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వరెడ్డి ఆదేశాల మేరకు రేపు అనగా బుదవారం రోజున ఉదయం 10 గంటలకు ఉషోదయ ఫంక్షన్లో జరుగు భువనగిరి పార్లమెంటు నియోజక వర్గ స్థాయి ముఖ్య నాయకులు మాజీ ప్రజాప్రతినిధుల కార్యకర్తల సమావేశానికి , భువనగిరి పార్లమెంటు బిఆర్ఎస్ పార్టీఅభ్యర్థి క్యామ మల్లేష్ పాల్గొంటున్న సందర్భం గా జెడ్పిటిసి,ఎంపీపీ, పిఎసిఎస్ చైర్మన్ లు, డైరెక్టర్లు ,మండల ఎంపీటీసీలు ,మాజీ సర్పంచ్లు,మాజీ రైతు కోఆర్డినేటర్ లు, గ్రామ ల అధ్యక్షులు, కార్యదర్శులు ముఖ్య నాయకులు ,కార్యకర్తలు అభిమానులు , పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

