హనుమాన్ గుడిలో పంచాంగ శ్రవణం.

మన సాక్షి గొంతుక ప్రతినిధి బచ్చన్నపేట మండలం.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని బండనగారం గ్రామంలో ఆంజనేయ స్వామి గుడిలో పూజారి జంగిలి ఆంజనేయులు గ్రామస్తులకు పంచాంగ శ్రవణం వినిపించారు, రాశుల ఫలితం ఆధారంగా పంచాంగ శ్రవణం వినిపించారు, గ్రామస్తులు వారి వారి భవిష్యత్తు గురించి అడిగి తెలుసుకున్నారు, ఈ సంవత్సరం ఎర్ర పంటలు బాగా పండుతాయి అని, వర్షాకాలం సమృద్ధిగా పడుతుందని అన్నారు, బంజేరు గ్రామంలో, హనుమాన్ గుడి ఆలయ పూజారి జంగిలి శ్రీరామ్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు పంచాంగ శ్రవణం వినిపించారు. కురుమ కులస్తుల ఆరాధ్య దైవమైన బీరప్ప గుడి ఆవరణలో పూజారి పంచాంగ శ్రవణం వినిపించారు ఈ కార్యక్రమంలో, కొల్ల నర్సిరెడ్డి,బండ నాగారం మాజీ సర్పంచ్ కవిత రాజనర్సయ్య, నిడికొండ సత్తయ్య, రా పెళ్లి చక్రపాణి, సిద్దేశ్వర స్వామి దేవస్థానం డైరెక్టర్ ఆరేళ్ల భాస్కర్, ఇప్పశ్రీధర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ నిమ్మల కర్ణాకర్, జంగిలి స్వామి జంగిలి మల్లేశం చిగుళ్ల రాములు, జంగిలి స్వామి,మీస సత్యనారాయణ. రా సూరి రాకేష్, తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.

