చిల్కూర్ బాలాజీ ని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి

మన సాక్షి గొంతుక ప్రతినిధి / చేవెళ్ల
మొయినాబాద్ మండలం లోని చిల్కూర్ బాలాజీ టెంపుల్ లో వెంకటేశ్వరా స్వామిని దర్శించుకొని తెలంగాణ ప్రజలందరికి తెలుగు సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియచేసారు క్రోది నామ సంవత్సరం ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు.తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని, స్వామి వారిని వేడుకున్నని అలాగే చేవెళ్ల నియోజకవర్గం ప్రజలు నన్ను మరో సారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ చేవేళ్ల ఇంచార్జ్ పామేనా భీమ్ భారత్ హిమాయత్ నగర్ మాజీ సర్పంచ్ పల్లగొల్ల మల్లేష్ యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు షాబాద్ దాస్ హిమాయత్ నగర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ ముదిరాజ్ కంజర్ల శేఖర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, నవీన్ పురుడు కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్, పూడూరు టిల్లు పూడూర్ రాజు,సంగం రాజు విలేజ్ వర్కింగ్ ప్రెసిడెంట్, బైకని కుమార్ యాదవ్ మండల లీగల్ సెల్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

