Monday, March 2, 2026

పేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ

హంసాత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మహమ్మద్ యాకూబ్ పాషా ఆధ్వర్యంలో

— ఇమామ్ లకు మరియు పేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ


మన సాక్షి గొంతుక ప్రతినిధి/జనగామ:

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు హం సాత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మహమ్మద్ యాకుబ్ పాషా ఆధ్వర్యంలో దాతల సహకారంతో జనగామ జిల్లా స్టేషన్గన్పూర్ మండలం, జనగామ నియోజక వర్గం మద్దూరు మండలంకు సంబంధించిన పలు గ్రామాల మజీద్ ఇమామ్ లకు మరియు పేద కుటుంబాలకు నెలకు సరిపడే నిత్యవసర సరుకులను అందజేశారు.అనంతరం మహమ్మద్ యాకుబ్ పాషా మాట్లాడుతూ జనగామ జిల్లా లో మారుమూల గ్రామాల మజీద్ లలో సేవలు అందిస్తు ఈ రంజాన్ మాసంలో ఖురాన్ ను బోధిస్తూ ఎన్నో సేవలు అందిస్తున్న ఇమామ్ ల వారి కుటుంబాలు కూడా సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం లాగే ఈ ఈ రంజాన్ మాసంలో కూడా ఇమామ్ లకు మరియు పేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందించామని ఈ రంజాన్ మాసంలో మేము చేపట్టిన కార్యక్రమాల్లో మాకు సహకరించిన దాతలకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తు ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలు గ్రామాల మజీద్ ఇమామ్ లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular